
525views
ఉత్తర్ ప్రదేశ్లోని మథురలో కృష్ణ జన్మభూమి- షాహీ ఈద్గా వివాదంపై విచారణను అలహాబాద్ హైకోర్టు వాయిదా వేసింది. కేసు కొనసాగింపును సవాలుచేస్తూ దాఖలైన పిటిషన్ కు తమ వివరణను తెలియజేయాలని హిందూ పక్షానికి కోర్టు ఆదేశాలు జారీచేసింది. డిసెంబరు 14న షాహీ ఈద్గాలో శాస్త్రీయ సర్వేకు హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను మంగళవారం సుప్రీంకోర్టు నిలిపేసిన విషయం తెలిసిందే. బుధవారం ఈ కేసు విచారణకు రాగా సుప్రీంకోర్టు ఆదేశాలను హైకోర్టులో సమర్పించారు. ఈ క్రమంలో కేసు కోనసాగింపుపై తమ సమాధానాలను దాఖలు చేయాల్సిందిగా జస్టిస్ మన్యాంక్ కుమార్ జైన్ కోరారు.





