
735views
ఆర్ఎస్ఎస్ పరువు నష్టం కేసులోరూ.15వేల పూచీకత్తుపై ముంబయి కోర్టు రాహుల్‌గాంధీకి బెయిల్ మంజూరు చేసింది. జర్నలిస్ట్, సామాజిక కార్యకర్త గౌరీ లంకేశ్ 2017లో కర్ణాటక రాజధాని బెంగళూరులో దారుణహత్యకు గురయ్యారు. ఈ ఘటనపై స్పందించిన రాహుల్ గాంధీ ఆర్ఎస్ఎస్, బీజేపీపై తీవ్ర ఆరోపణలు గుప్పించారు. అది ఆర్ఎస్ఎస్, బీజేపీ కలిసి చేయించిన హత్య అనే అర్థం వచ్చేలా వ్యాఖ్యానించారు. దీనిపై మండిపడిన ఆర్ఎస్ఎస్ రాహుల్‌పై పరువునష్టం దావా వేసింది. ఈ కేసు విచారణ సందర్భంగా రాహుల్ గాంధీ గురువారం ముంబయిలోని న్యాయస్థానానికి హాజరయ్యారు. తాను ఎవరి పరువుకు భంగం కలిగించేలా వ్యాఖ్యలు చేయలేదని, తనపై కేసును కొట్టేయాలని రాహుల్ కోర్టును కోరారు. ఇరువర్గాల వాదనలు విన్న న్యాయస్థానం రాహుల్‌గాంధీకి రూ.15వేల పూచీకత్తుపై బెయిల్ మంజూరు చేసింది. ఆ మొత్తాన్ని మాజీ ఎంపీ ఏకనాథ్ గైక్వాడ్ చెల్లించంతో రాహుల్ అక్కడి నుంచి వెళ్లిపోయారు.






