News

భవానీ దీక్షల విరమణ ఏర్పాట్లు పూర్తి చేయాలి : దుర్గగుడి ఛైర్మన్‌

341views

భవానీ దీక్షల విరమణ ఏర్పాట్లను నిర్ణీత వ్యవధిలోగా పూర్తి చేయాలని ఇంజినీరింగ్‌ అధికారులను దుర్గగుడి ట్రస్టుబోర్డు ఛైర్మన్‌ రాంబాబు కోరారు. దుర్గామల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానం జనవరి 3 నుంచి 7వ తేదీ వరకు నిర్వహించే భవానీ దీక్షల విరమణకు లక్షలాది మంది తరలి రానున్నారు. ఈ నేపథ్యంలో ఆదివారం ఏర్పాట్లను ఈవో రామరావుతో కలసి ట్రస్టుబోర్డు ఛైర్మన్‌ రాంబాబు క్షేత్రస్థాయిలో పరిశీలించారు. పున్నమి, సీతమ్మవారి పాదాలు, దుర్గాఘాట్‌ల వద్ద తలనీలాలు సమర్పించే భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు చేయాలని సూచించారు. క్యూలైన్లో ప్రవేశించిన భక్తుడు అమ్మవారి దర్శనం చేసుకొని ఇరుముడి సమర్పించి ప్రసాదాలతో ఇల్లు చేరేంత వరకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకూడదన్నారు. దేవస్థానం ఈఈ రమాదేవి, డీఈ రవీంద్ర, ఏఈ రామకృష్ణ పాల్గొన్నారు.