News

రాముడి భజనలను సామాజిక మాధ్యమాల్లో పంచుకోండి : ప్రధాని

310views

అయోధ్యలో రామ మందిర ప్రారంభోత్సవం కోసం దేశమంతా ఉత్సుకతతో ఎదురుచూస్తోందని ప్రధాని అన్నారు. ‘మన్‌ కీ బాత్‌’ 108వ ఎపిసోడ్‌లో ఆదివారం ఆయన ప్రసంగించారు. గత కొన్ని రోజుల్లో అనేక మంది శ్రీరాముడు, అయోధ్యపై కొత్త గీతాలు, పద్యాలు, భజనలు సృష్టించారని తెలిపారు. వాటన్నింటినీ ‘శ్రీరామ్‌ భజన్‌’ హ్యాష్‌ట్యాగ్‌తో సామాజిక మాధ్యమాల్లో పంచుకోవాలని పిలుపునిచ్చారు.