News

అయోధ్య రాముడి తలంబ్రాలతో భారీ ర్యాలీ

261views

అయోధ్య రామమందిరం నుంచి వచ్చిన తలంబ్రాలతో వైఎస్ఆర్ కడప జిల్లా వేంపల్లెలో వీహెచ్‌పీ ఆధ్వర్యంలో శనివారం భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళలు తలంబ్రాలను తలపై ఉంచుకుని జైశ్రీరాం అంటూ నినాదాలు చేస్తూ ముందుకు నడిచారు. కడప రోడ్డులోని హనుమాన్‌ జంక్షన్‌ నుంచి నాలుగురోడ్ల కూడలి, గాంధీరోడ్డు, మెయిన్‌బజార్‌, కాపువీధి మీదుగా ర్యాలీ నిర్వహించారు. అనంతరం అందరికీ తలంబ్రాలు పంపిణీచేశారు. కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు శశిభూషణ్‌రెడ్డి, కాంగ్రెస్‌ పార్టీ మీడియా సెల్‌ ఛైర్మన్‌ తులసిరెడ్డి, బీజేపీ జిల్లా ఉపాధ్యక్షురాలు సుష్మ, టీడీపీ నాయకుడు అయ్యవారిపల్లె పాపిరెడ్డి, శ్రీచైతన్య, ఉషాకిరణ్‌, స్వామివివేకానంద కరస్పాండెంట్లు చక్రపాణిరెడ్డి, రమణారెడ్డి, రామాంజనేయరెడ్డి, దొంతుసుమన్‌, తదితరులు పాల్గొన్నారు.