
( డిసెంబరు 26 – ఉద్ధం సింగ్ జయంతి )
1919 ఏప్రిల్ 13 పంజాబ్ లోని అమృతసర్ లో జలియన్ వాలాబాగ్ అనే చిన్నతోటలో రౌలత్ చట్టానికి వ్యతిరేకంగా, శాంతియుతంగా సభ జరుపుకుంటున్న ప్రజలపై జనరల్ డయ్యర్ విచక్షణారహితంగా కాల్పులు జరపడంతో దాదాపు వెయ్యిమంది మరణించారు. రెండువేలమంది క్షతగాత్రులైనారు. ఇది అత్యంత ఘోరమైన సంఘటనగా చరిత్రలో మిగిలిపోయింది. ఈ ఘటన దేశంలోని అనేక మందికి ఆగ్రహానికి గురిచేసింది “ఈ దురంతానికి కారకుడైన వ్యక్తులను చంపేదాకా నేను చావను” అంటూ ప్రతిజ్ఞ చేశాడు ఓ యువకుడు ఆతడే దేశం కోసం ప్రాణాలర్పించిన దేశభక్తుడు ఉద్ధం సింగ్.
ఉద్ధం సింగ్ పంజాబ్ రాష్ట్రంలోని సంగ్రూర్ లోని సునం అనే పట్టణం లో జన్మించారు.ఉద్ధం సింగ్ తన తల్లి తండ్రులను చిన్న తనం లోనే కోల్పోయారు. అనంతరం అమృత్ సర్ లోని ఒక అనాధ శరణాలయంలో పెరిగారు. ఉద్ధం జలియన్ వాలాబాగ్ సభ జరిగిన రోజు సభలో మంచినీరు సరఫరా చేయడానికి అనాథశరణాలయం నుండి వచ్చాడు.ఆ రోజు అక్కడ జరిగిన నరమేధం చూసి చలించిపోయాడు. నేలపై పడుకొని ప్రాణాలు కాపాడుకున్న ఉద్ధం సింగ్ శవాల గుట్టలను చూసి కోపంతో ఈ దురంతానికి కారకుడైన వ్యక్తులను హతమార్చాలని అంటూ శపధం చేశాడు.
దీనికి కారకులైన డయ్యర్స్ ను వెతుక్కుంటూ బయలుదేరాడు. తుపాకీ కాల్చడం నేర్చుకుని, భగత్ సింగ్ తో కలిసి విప్లవ కార్యక్రమాలలో పాల్గొన్నాడు. డయ్యర్స్ లో ఒకరైన ఫ్రాన్సిస్ డయ్యర్ 1927లో భారత్ లోనే చనిపోగా.. జనరల్ ఓ డయ్యర్ ను చంపేందుకు ఇంగ్లండ్ పయనమవ్వాలనుకుంటున్న సమయంలో భగత్ సింగ్ తో పాటు ఆయనను అరెస్ట్ చేశారు. తన కళ్ళ ముందే భగత్ సింగ్ ను ఉరితీయడం చూసి హతాశుడైనాడు. 1932లో విడుదలైన తర్వాత ఇంజనీరింగ్ చదవాలని ఇంగ్లండ్ వెళ్లి.. పేర్లు మార్చుకుంటూ జనరల్ ఓ డయ్యర్ ను వెంటాడసాగాడు.
ఒక రోజు ఓ డయ్యర్ ఒక కాన్ఫరెన్స్ కు హాజరుకాబోతున్నట్లు సమాచారంతో అక్కడికి వెళ్ళాడు.. పుస్తకంలో ఫిస్టల్ పట్టేటట్లు కాగితాలను కత్తించి అందులో దానిని దాచి ఓ డయ్యర్ సభకు వెళ్ళాడు. సభలో ఓ డయ్యర్ ను పొగడ్తలతో ముంచెత్తుతున్నారు . అది వింటున్న ఉద్ధం సింగ్ జలియన్ వాలా బాగ్ లో అమాయకుల ఆర్తనాదాలు గుర్తొచ్చాయి. ప్రాణాలు విడిచిన అభాగ్యులు గుర్తుకొచ్చారు.
ప్రసంగం అనంతరం ఓ డయ్యర్ అభినందించడానికి వెళ్తునట్టు వెళ్తూ ఉద్ధం సింగ్ పుస్తకం లోపల ఉన్న గన్ తో అక్కడ సంభాషిస్తున్న ఓ డయ్యర్ పై కాల్పులు జరపగా అతను అక్కడికక్కడే మరణించాడు. జనరల్ ఓ డయ్యర్ ఎవరినైతే నా బానిసలు, వారి ప్రాణాలు నేను పెట్టిన బిక్ష అంటూ జలియన్ వాలాబాగ్ కాల్పుల తర్వాత గర్వంగా అన్నాడో, ఆ సంఘటనలోని వ్యక్తి ఉద్ధం సింగ్ చేతిలోనే ప్రాణాలు కోల్పోయాడు డయ్యర్.
డయ్యర్ ను చంపిన తరువాత “ఈయనను చంపడానికే నేను ఇన్నిరోజులు బతికాను. ఇంక నన్ను ఏమైనా చేసుకోండి” అంటూ లొంగిపోయాడు ఉద్ధం సింగ్. అతనికి అక్కడి కోర్ట్ ఉరి శిక్ష విధించింది. 1940 జులై 31న విప్లవవీరుడైన ఉద్ధం సింగ్ ను ఉరి తీశారు.1974 లో ఉద్ధం సింగ్ అవశేషాలను భారత్ కు పంపగా అతని జన్మ స్థలమైన సునం లోనే దహన సంస్కరాలు చేశారు. చితాభస్మంలోని కొంత భాగం ను సుట్లేజ్ నది లో కలపగా మిగిలిన భాగాన్ని జలియన్ వాలా భాగ్ లో భద్ర పరిచారు.
భారత్ యువశక్తిని తెలుపుతూ, దేశభక్తిని చాటి బ్రిటిష్ వారి గుండెలో భయం పుట్టించిన ధీరుడుగా అమర వీరుడుగా నిలిచిపోయారు ఉద్ధం సింగ్





