
327views
మచిలీపట్నం మహతి కళావేదిక నందు కృష్ణా జిల్లా శాఖ అయోధ్య శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ ఆధ్వర్యంలో అయోధ్య నుండి తీసుకువచ్చిన శ్రీరామ పట్టాభిషేక అక్షింతలు ప్రతిమ మరియు రామనామంతో కూడిన పుస్తకాలు జండాలను మచిలీపట్నం మండల వ్యాప్తంగా ప్రజలకు అందించే కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. జనవరి నెలలో దివ్య రామ మందిరం నిర్మాణం పూర్తి చేసుకుని జాతికి అంకితం ఇస్తున్న తరుణంలో ప్రతి ఇంటి మీద శ్రీరాముని జెండా ఎగురవేసి ధర్మ పరిరక్షణకు పాటుపడుతూ ప్రతిష్టా కార్యక్రమం జరిగే వారం రోజులు ఇంట్లో హనుమాన్ చాలీసా కార్యక్రమం నిర్వహించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. రాముల వారి ఆశీస్సులు భారత దేశంలో ప్రతి ఒక్కరికి దక్కాలని దేశంతో కార్యక్రమాన్ని చేసినట్లు నిర్వాహకులు తెలిపారు.





