
461views
అయోధ్యలో నూతనంగా నిర్మించిన రామాలయ ప్రారంభోత్సవం సందర్భంగా,భారతదేశంలో ప్రతి ఇంటికి అక్షంతలు దాంతోపాటు సీత రాముల వారి ఫోటో ప్రతి ఇంటికి పంపిణి చేయాలని ఉద్దేశంతో శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్, విశ్వహిందూ పరిషత్, రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ లు నిర్ణయించాయి. ఆ మేరకు అయోధ్యలో పూజించిన అక్షతలు దేశవ్యాప్తంగా పలు ప్రాంతాలకు చేరుకున్నాయి. వాటిని జిల్లాల వారీగా పంపిణీ చేస్తున్నారు . అయోధ్యలో నిర్మితమైన శ్రీరామాలయ మహాకుంభాభిషేక వేడుకలు జనవరి 22న నిర్వహించనున్న విషయం తెలిసిందే. ఇంటింటికీ వెళ్లి శ్రీరాములవారి అక్షతలను, తాంబూలాన్ని అందించి ప్రజలను ఆహ్వానిస్తున్నారు. అక్షతలతోపాటు రామలీలా చిత్రపటం, ఆహ్వానపత్రిక పంపిణీ చేస్తున్నారు. జైశ్రీరామ్ నినాదాల మధ్య అక్షింతల పంపిణీ కార్యక్రమం జరుగుతుంది. భక్తులు వారికి పూలతో స్వాగతం పలుకుతున్నారు.





