News

సంస్కృతంలో ప్రమాణ స్వీకారం చేసిన ముస్లిం ఎమ్మెల్యేలు

316views

రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపొందినవారిలో ఇద్దరు ముస్లింలు సంస్కృతంలో ఎమ్మెల్యేలుగా ప్రమాణం చేయడం చాలా మంది దృష్టిని ఆకర్షించింది. ప్రమాణ స్వీకారం చేసిన రోజు నుంచి వీరిద్దరిపై చర్చ నడుస్తోంది.

వీరిలో, స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేసి గెలిచిన యూనస్ ఖాన్ ఒకరైతే, కాంగ్రెస్‌కు చెందిన జుబేర్ ఖాన్ మరొకరు.రామ్‌గఢ్ స్థానం నుంచి జుబేర్ ఖాన్ గెలుపొందితే, దివానా నియోజకవర్గం నుంచి యూనస్ ఖాన్ గెలిచారు.

“భారత రాజ్యాంగంలోని ఎనిమిదో షెడ్యూల్‌లో ఉన్న అధికారిక భాషల్లో సంస్కృతం ఒకటి. ఇది మన పురాతన భాషల్లో ఒకటి” అని చెప్పారు.‘‘వేదాలు, పురాణాలు, రామాయణం సంస్కృతంలో రాశారు. భారతదేశంలోని అన్ని భాషలకు సంస్కృతం తల్లివంటిది. నేను కూడా భారతీయుడిని. మన దేశంలో సంస్కృతం అత్యంత గొప్ప పురాతన భాష. సంస్కృతంలో ప్రమాణం చేసినందుకు చాలా గర్వపడుతున్నాను” అని యూనస్ ఖాన్ తెలిపారు.

“ప్రమాణం చేయడానికి మా ముందు మూడు ప్రత్యామ్నాయాలున్నాయి. ఒకటి ఇంగ్లిష్. ఇంగ్లిష్ అంటే బ్రిటిష్ వారి భాషలో ప్రమాణం చేస్తున్నట్టు. మిగతా రెండు- హిందీ, సంస్కృతం” అన్నారు.”మన పురాతన పద్ధతులు క్రమక్రమంగా కనుమరుగవుతున్నాయి. సంస్కృతంలో ప్రమాణం చేయడం సరైన పని అనిపించింది. మనమే వాటిని అలవరచుకోకపోతే ఇంకెవరు చేస్తారు? సంస్కృతం మన భారతీయ భాష” అన్నారు.”సంస్కృతం ఏదో ఒక సామాజిక వర్గానికి చెందిన భాష కాదు, భారతీయతకు సంబంధించింది. సంస్కృతానికి ప్రత్యేక సమాజం, వర్గం, మతమంటూ లేవు. ప్రతి ఒక్కరూ సంస్కృతాన్ని నమ్ముతారు. ప్రతి ఒక్కరూ దానిని తమదని భావిస్తారు” అని జుబేర్ ఖాన్ అన్నారు.