
2024 జనవరి 3 నుంచి 7 వరకు భవానీ దీక్షల విరమణలో భాగంగా ఘాట్ రోడ్డు మార్గంలో తాత్కాలిక క్యూలైన్లు ప్రారంభిస్తున్నట్లు విజయవాడ కనకదుర్గ ఆలయం ఛైర్మన్ రాంబాబు తెలిపారు.దీక్షల విరమణ తాత్కాలిక క్యూలైన్ పనులను ఈవో తో కలిసి ఆయన ప్రారంభించారు. స్థానాచార్య శివప్రసాదశర్మ పూజల తర్వాత అధికారులు పనులు చేపట్టారు. రాంబాబు మాట్లాడుతూ…. ఏర్పాట్లను భక్తులకు ఇబ్బంది లేకుండా నిర్ణీత వ్యవధిలో పూర్తి చేయాలని సూచించారు. దేవస్థానం ఈఈ కోటే శ్వరరావు, డీఈ వెంకటేశ్వరరావు, ఏఈ అశోక్ పాల్గొన్నారు.
భవానీ దీక్షల విరమణకు కనకదుర్గా నగర్ లో హోమ గుండాలు ఏర్పాటు చేస్తామని ఈవో రామారావు అన్నారు. భవానీ దీక్షల విరమణ ఏర్పాట్లను పశ్చిమ ఏసీపీ హనుమంతరావు, ఈఈలు కోటేశ్వరరావు, రమాదేవితో కలిసి ఈవో పరిశీలించారు. తొక్కిసలాటకు తావు లేకుండా హోమగుండాల్లో నేతి కొబ్బరికాయ సమర్పణ, ప్రసాదాల కౌంటర్లలో దీక్షాధారులకు ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లు చేస్తున్నటు తెలిపారు. దీక్షాధారులకు దేవస్థానం తరఫున అన్నప్రసాదం ఇస్తామన్నారు.





