News

యూపీ పోలీసుల ఎదుట వినూత్న రీతిలో లొంగిపోయిన గోవధ నిందితుడు

407views

గోవధ కేసులో నిందితుడిగా ఉన్న మహ్మద్‌ ఆలం అనే గ్యాంగ్‌స్టర్‌ ఉత్తర్‌ప్రదేశ్‌ బదాయూ జిల్లాలోని సహస్వాన్‌ పోలీస్‌స్టేషన్‌లో వినూత్న రీతిలో లొంగిపోయాడు. ‘యోగి బాబా.. దయచేసి నన్ను కాపాడండి. ఇక నుంచి నేను గోహత్య చేయను’ అని రాసిన ప్లకార్డును మెడలో ధరించి అతను పోలీసుల ఎదుట లొంగిపోవడం విశేషం. ఖైర్‌పుర్‌ ఖైరతి గ్రామానికి చెందిన మహ్మద్‌ ఆలం కొంతకాలంగా గోహత్యలకు పాల్పడుతున్నాడనే ఆరోపణలు ఉన్నాయి. దీంతో అతడిపై గోవధ నిషేధ చట్టం కింద కేసు నమోదైంది. ఆలంను కోర్టులో హాజరు పరచనున్నట్లు ఎస్‌ఎస్‌పీ ఓపీ సింగ్‌ తెలిపారు.