
337views
తిరుపతిలోని శ్రీవేంకటేశ్వర విశ్వవిద్యాలయంలో సోమవారం సెమీ క్రిస్మస్ వేడుకలు నిర్వహించడంపై విమర్శలు వెల్లువెత్తాయి. కార్యక్రమానికి వర్సిటీ ఉన్నతాధికారులు అనుమతులు ఇవ్వగా, ఆర్ట్స్ బ్లాక్ ఆడిటోరియంలో పలువురు ఆచార్యులు, విద్యార్థులు పాల్గొని క్రైస్తవ మత ప్రార్థనలు నిర్వహించారు. గతంలో ఎప్పుడూ ఎస్వీయూలో సెమీ క్రిస్మస్ వేడుకలు జరపలేదని, ఈసారి ఉన్నతాధికారులు ఎలా అనుమతించారని ఆచార్యులు, విద్యార్థి సంఘాల నాయకులు ప్రశ్నించారు.





