News

రెండో కాశీ తమిళ సంగమం ప్రారంభం

287views

నమో ఘాట్ వద్ద కాశీ తమిళ సంగమం రెండో ఎడిషన్‌ను ప్రధాని ప్రారంభించారు. దీనిలో భాగంగా డిసెంబర్‌ 17-30 మధ్య సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఇందుకోసం తమిళనాడు నుంచి వందల సంఖ్యలో ప్రతినిధులు పాల్గొంటారు. ఈ సందర్భంగా మోదీ ప్రసంగాన్ని కృత్రిమ మేధ సాయంతో అనువదించారు. ‘తమిళనాడు నుంచి వచ్చిన వారంతా ఇయర్‌ ఫోన్స్‌ ధరించాలని కోరుతున్నాను. ఈ సాంకేతికత నా హిందీ ప్రసంగాన్ని తమిళంలో అనువదిస్తుంది. ఇది నాకు తొలి అనుభవం’ అని అన్నారు. అన్ని వర్గాల ప్రజలకు మరింత చేరువకావడానికి ఈ సాంకేతికత ఉపకరిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కాశీ తమిళ సంగమం ఎక్స్‌ప్రెస్‌ను జెండా ఊపి ప్రారంభించారు. ఇది వారణాసి నుంచి కన్యాకుమారి మధ్య రాకపోకలు సాగిస్తుంది.