News

వెలుగులోకి 16వ శతాబ్దం నాటి శాసనం

251views

నల్లమల అటవీ ప్రాంతంలోని పాలుట్ల గిరిజన గూడెంలో ఉన్న పోలేరమ్మ ఆలయం వద్ద… 16వ శతాబ్దం నాటి తెలుగు శాసనం బయటపడింది. చారిత్రక పరిశోధకులు తురిమెళ్ల శ్రీనివాస ప్రసాద్‌, వీఆర్వో జి.ఆదినారాయణ వాటిని గుర్తించి… ఆ చిత్రాలను పురావస్తుశాఖ డైరెక్టర్‌ మునిరత్నంకు పంపారు. ఆయన వాటిని పరిశీలించి… గుంటూరు జిల్లా గురజాలకు చెందిన లింగంభట్టు కుమారుడు జంగం ద్వారా పోలేరమ్మ దేవతకు ఊయల స్తంభాలు నిర్మించినట్లు శాసనంలో పేర్కొన్నట్లు చెప్పారు. దీని పక్కనే లభ్యమైన మరో శిల్పంలో… ఓ వీరుడు సింహంతో పోరాడుతున్నట్లుగా చెక్కినట్లు వివరించారు.