
267views
శబరిమల అయ్యప్పస్వామి దర్శనానికి వచ్చే చిన్నారులు సులభంగా మణికంఠుడి సన్నిధికి చేరుకునేందుకు వీలుగా ట్రావెన్‌కోర్ దేవస్థానం బోర్డు (టీబీడీ) ఆదివారం నుంచి ప్రత్యేక గేటు వ్యవస్థను అందుబాటులోకి తెచ్చింది. ‘‘ఆదివారం ఉదయం నుంచి చిన్నారులకు ముందు వరుసలో అయ్యప్ప దర్శనం కల్పిస్తున్నాం. దీంతో వారికి పొడవైన క్యూలైన్ల బాధ తప్పింది. ఈ చర్య చిన్నారుల తల్లిదండ్రులకు, ప్రత్యేకంగా కేరళ వెలుపలి నుంచి వచ్చిన భక్తులకు ఎంతో ఉపయుక్తం’’ అని టీబీడీ ఓ ప్రకటనలో పేర్కొంది.
* శబరిమలలో భక్తులకు మెరుగైన సౌకర్యాల కల్పనలో భాగంగా త్వరలో వైఫై సౌకర్యాన్ని అందుబాటులోకి తేనున్నట్లు టీబీడీ తెలిపింది.





