
332views
హిందు వులు హలాల్ మాంసం తినడం వదులుకొని, దానికి బదులుగా ‘ఝట్కా’ మాంసాన్ని (ఒక్క వేటుతో జంతువును చంపడం) వినియోగించాలని కేంద్రమంత్రి గిరిరాజ్ సింగ్ వ్యాఖ్యా నించారు. బిహార్ లోని తన పార్లమెంటరీ నియో జకవర్గమైన బెగూసరామ్లో ఆయన మాట్లాడారు. భాజపా సీనియర్ నేత అయిన గిరిరాజ్ సింగ్ తన మద్దతుదారులతో హలాల్ మాంసాన్ని తినడం ద్వారా ఇకపై తమ ధర్మాన్ని పాడుచేయబోమని ప్రతిజ్ఞ కూడా చేయించారు. హిందువులు కూడా తమ మత సంప్రదాయాల పరిరక్షణకు అదే కట్టుబాటు చూపించాలి” అని గిరిరాజ్ అన్నారు. పార్లమెంటులోకి ప్రవేశించిన నిందితులపై సానుభూతి చూపుతున్న రాహుల్ గాంధీ గతంలోనూ జేఎన్టీయూ ఆవరణలో దేశ ద్రోహ నినాదాలు చేసిన వ్యక్తులకు మద్దతు పలికారని కేంద్రమంత్రి ఎద్దేవా చేశారు.





