Newsvideos

గీతాలతో జాతిని జాగృతం చేసిన జాతీయ కవి గరిమెళ్ళ సత్యనారాయణ

493views

స్వాతంత్ర ఉద్యమకాలంలో “మాకొద్దీ తెల్ల దొరతనము” అంటూ తన పాటలతో ప్రజలను ఉర్రుతలూగించి స్వాతంత్ర పోరాటం వైపు జనాలను మళ్లించిన జాతీయ కవి గరిమెళ్ళ సత్యనారాయణ గారు. తెలుగు నాట జాతీయ కవిత్వానికి ఒరవడి పెట్టిన కవి ప్రముఖుడు గరిమెళ్ళ. ఆయనంత ప్రసిద్ధి పొందిన జాతీయకవి ఆ రోజుల్లో మరొకరు లేరు దేశభక్తి కవితలు వ్రాసి పాడి జైలు శిక్ష అనుభవించినవారిలో ప్రథముడు గరిమెళ్ళ ఈయన పాటలు సత్యాగ్రహులకు గొప్ప తెగువను ఉత్తేజాన్ని కలుగజేసేవి. అలాగే “దండాలు దండాలు భరతమాత “అనే గీతము ప్రజలను ఎంతాగానో జాగృతం చేసింది.