
245views
ఉత్తర్‌ప్రదేశ్‌లోని అయోధ్యలో రామమందిరం ప్రారంభం నేపథ్యంలో ఏర్పాట్లు శరవేగంగా జరుగుతున్నాయి. 2024 జనవరి 22న జరగనున్న ఈ కార్యక్రమానికి భారీ స్థాయిలో భక్తులు తరలి వచ్చే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఆ మేరకు తగిన ఏర్పాట్లు చేస్తున్నారు. మరోవైపు ఈ కార్యక్రమానికి భక్తులు పెద్ద ఎత్తున తరలిరావొద్దని రామ మందిర ట్రస్ట్ కార్యదర్శి చంపత్ రాయ్ విజ్ఞప్తి చేశారు. జనవరి 22న అయోధ్యకు వచ్చే బదులు భక్తులు తమ సమీపంలోని మందిరాల్లోనే ప్రత్యేక పూజలు చేయాలని రాయ్ సూచించారు. నగరంలో రద్దీని నివారించడం కోసమే తాము ఈ విజ్ఞప్తి చేస్తున్నట్లు వివరించారు. గర్భగుడి నిర్మాణం పూర్తిచేసినట్లు వెల్లడించారు. అలాగే విగ్రహాలు కూడా సిద్ధమయ్యాయని వెల్లడించారు.





