News

భారత సైనికులపై బంగ్లాదేశ్ స్మగ్లర్ల దాడిని తిప్పి కొట్టిన బీఎస్ఎఫ్

245views

అంతర్జాతీయ సరిహద్దు గుండా భారత్ లోకి చొరబడేందుకు బంగ్లాదేశ్ స్మగ్లర్లు చేసిన ప్రయత్నాన్ని బీఎస్ఎఫ్ సిబ్బంది తిప్పికొట్టారు. ఈ క్రమంలో స్మగ్లర్లు దాడికి దిగడంతో ఆత్మరక్షణ కోసం భద్రతా సిబ్బంది కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ఇద్దరు స్మగ్లర్లు హతమయ్యారు. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. పశ్చిమ బెంగాల్ రాష్ట్రం నదియా జిల్లా గోవిందప్పుర్ సమీపంలో అంతర్జాతీయ సరిహద్దు వద్ద కొత్తగా ఏర్పాటు చేసిన ముళ్లకంచెను కత్తిరించి భారత్ వైపు చొరబడేందుకు బంగ్లాదేశకు చెందిన కొందరు స్మగ్లర్లు ప్రయత్నించారు. దీన్ని గమనించిన గస్తీ బృందం గాల్లోకి కాల్పులు జరపడంతో వారు పారిపోయారు. ఆ తర్వాత కాసేపటికి ఆయుధాలతో వచ్చి అక్కడ గాలిస్తున్న భద్రతా సిబ్బందిపై దాడికి దిగారు. వారు ఆత్మరక్షణ కోసం ఎదురుకాల్పులు జరపడంతో ఇద్దరు స్మగ్లర్లు హతమయ్యారు.