
356views
తోటివారి హృదయాల్ని మేలుకొలిపి, వారిలో ఆత్మగౌరవ ఆకాంక్షను రగిలించిన పద్మభూషణుడు బోయి భీమన్నకవి. ఆధునిక తెలుగు సాహిత్యంలో తనకంటూ ఒక సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న కళా ప్రపూర్ణుడాయన. పద్యం, గద్యం, గేయం, నాటకం, నాటిక, వచన కవిత వంటి పలు సాహితీ ప్రక్రియల్లో 70కి పైగా రచనలను వెలువరించిన భీమన్న భావం సున్నితం! భాష సుందరం! ఆశయం అద్భుతం! “బానిసతనమును బాపుమురా… భారతభూమికి భాగ్యము తేరా! సకల దేశముల సర్వ మానవుల సామ్యము సాధింపుమురా!!” అంటూ తన రచనలతో సమాజాన్ని ప్రేరేపించిన సమరసతా సాహిత్య సిద్ధాంతకర్త బోయి భీమన్న.





