
జనవరి 22న అయోధ్యలోని రామమందిరంలో జరగనున్న రామ్ లల్లా విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమం జరగనుంది. ఈ సందర్భంగా అర్చకుల బృందానికి వారణాసికి చెందిన 86 ఏళ్ల వేద కర్మకాండ్(ఆచారాలు) పండితుడు, పండిట్ లక్ష్మీ కాంత్ మధురనాథ్ దీక్షిత్ నాయకత్వం వహించనున్నారు. జనవరి 16 నుంచి 22 మధ్య విగ్రహ ప్రతిష్ఠాపన ఆచారాలను నిర్వహించేందుకు కాశీ నుంచి 40 మందికి పైగా దేశమంతటా అన్ని వేదాల శాఖలకు చెందిన 121 మంది పండితుల బృందానికి పండిట్ లక్ష్మీ కాంత్ నాయకత్వం వహిస్తారు.
లక్ష్మీకాంత్ పూర్వీకులు 17వ శతాబ్దానికి చెందిన కాశీ పండితుడు గాగా భట్. ఈయన 1674లో ఛత్రపతి శివాజీ మహారాజ్ పట్టాభిషేకం సమయంలో పూజారిగా ఉన్నారు. ఆయన వారసులుగా పండిట్ లక్ష్మీకాంత్..రామ్‌లల్లా విగ్రహ ప్రతిష్ఠాపనకు నాయకత్వం వహిస్తున్నారు. రామ్ లల్లా పవిత్రోత్సవాన్ని పర్యవేక్షించే బాధ్యత తమకు అప్పగించినందుకు లక్ష్మీకాంత్ కృతజ్ఞతలు తెలియజేశారు. ఈయన జనవరి 22న ప్రధాన ఆచారాలను నిర్వహించనున్నారు. మొత్తంగా శివాజీ మహారాజ్ పట్టాభిషేకం మహోత్సవంలో భాగంగా లక్ష్మీకాంత్ పూర్వీకులు పూజారిగా ఉంటే, ఇప్పుడు ఆయన శ్రీరాముడి ప్రాణప్రతిష్ఠ మహోత్సవానికి నేతృత్వం వహిస్తున్నారు. నిజంగా ఎంతో భాగ్యం చేసుకుంటే ఇటువంటి అదృష్టం వరించదు కదా..పూర్వజన్మ సుకృతం అంటే ఇదేనేమో





