News

క్రైస్తవాన్ని త్యజించి స్వధర్మంలోకి 220 కుటుంబాలు.. ఎక్కడంటే..

416views

ప్రలోభాలు, ఒత్తిళ్లు కారణంగా అన్యమతాలను స్వీకరించిన హిందువులు తమ తప్పు తెలుసుకొని తిరిగి స్వధర్మం స్వీకరించేందుకు ముందుకొస్తున్నారు. భారతదేశంలోనే కాకుండా ఇతర దేశాల్లో సైతం మతం మారిన హిందువులు సనాతన ధర్మంలోని గొప్పతనాన్ని తెలుసుకొని పొరపాటుని సరిదిద్దుకుంటున్నారు. తాజాగా ఇటువంటి ఘటన ఇస్లామిక్ దేశమైన బంగ్లాదేశ్‌లో చోటు చేసుకోవడం విశేషం. అక్కడ 220కు పైగా కుటుంబాలు క్రైస్తవాన్ని విడనాడి హిందూ మతాన్ని స్వీకరించారు.

బంగ్లాదేశ్‌లోని క్రైస్తవ మిషనరీలు చాలా ఏళ్ల క్రితం వనవాసీలను ప్రలోభపెట్టి క్రైస్తవ మతంలోకి మార్చాయి. కానీ ఆ కుటుంబాలు తాజాగా తమ మూలాధారం హిందూ మతం అని గ్రహించి తమ పూర్వీకులు చేసిన పొరపాటును సరిదిద్దాలని నిర్ణయించుకున్నారు.

వారు సనాతన ధర్మానికి తిరిగి రావాలనుకున్నారు. దీంతో ఘర్ వాపసీ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న అగ్నివీర్ సంస్థను సంప్రదించగా వారు శుద్ధి కార్యక్రమాలను నిర్వహించి 220 క్రైస్తవ కుటుంబాలను తిరిగి సనాతన ధర్మంలోకి ఆహ్వానించింది. సామూహిక సంప్రోక్షణ కార్యక్రమాలను నిర్వహించి సనాతన ధర్మంలోకి ఆహ్వానించారు.

హిందూ మతంలోకి పున: ప్రవేశం ఎంతో సంతోషంగా ఉందని…తిరిగి తమ తల్లిని చేరుకున్నట్లుగా ఉందని అన్యమతం నుంచి స్వధర్మం స్వీకరించిన వనవాసీలు తెలిపారు.

బంగ్లాదేశ్‌లో మైనార్టీలుగా ఉన్న హిందువులపై తరచుగా దాడులు జరుగుతుంటాయి. హిందూ దేవుళ్లు, పవిత్ర స్థలాలపై కూడా దాడులు అక్కడ నిత్యకృత్యం. అయితే మత మార్పిడీలపై అగ్నివీర్ సంస్థ చేపడుతున్న అవగాహన కార్యక్రమాలతో మార్పులు చోటు చేసుకుంటున్నాయి. హిందూ మతం పట్ల విశ్వాసం వ్యక్తం చేస్తున్నవారి సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. తాజా ఘటనే ఇందుకు నిదర్శనం.

ఇదిలా ఉంటే ఈ ఏడు ప్రధమార్థంలోనే కాకుండా అక్టోబర్ నెలలో సైతం 100 మంది క్రైస్తవ వనవాసీలు సనాతన ధర్మంలోకి తిరిగి వచ్చారు. ఆర్థిక ఇబ్బందుల కారణంగానే తమ పూర్వీకులు మతం మారారని, కానీ, నేటికీ తమ ఇబ్బందులు తొలగలేదని..వనవాసీలు చెప్పడం గమనార్హం.

Source : Panchjanya.com