News

టీటీడి ఆధ్వర్యంలో శ్రీనివాస కల్యాణాలు

228views

తిరుమల తిరుపతి దేవస్థానం శ్రీనివాస కల్యాణం ప్రాజెక్టు ఆధ్వర్యంలో ఈనెల 16 నుంచి 19వ తేదీ వరకు పశ్చిమ గోదావరి జిల్లాలోని నాలుగు ప్రాంతాల్లో శ్రీనివాస కల్యాణాలు జరగనున్నాయి. 16న పాలకొల్లు మండలం కేంద్రంలోని పెనుమదం రోడ్డులోని ఆర్‌ఆర్‌ రైస్‌మిల్లు మైదానంలో నిర్వహిస్తారు. 17న యలమంచిలి మండలం కట్టుపాలెంలోని శ్రీ కోదండ రామాలయం పక్కనున్న ఖాళీ స్థలంలో, 18న తణుకు మండలం దువ్వలోని పాఠశాల మైదానంలో, 19న తాడేపల్లిగూడెం మండలం పడాల మార్కెట్ యార్డులో శ్రీవారి కల్యాణాలు నిర్వహించనున్నారు.