News

2040 నాటికి 40 బిలియన్ డాలర్లకు భారత అంతరిక్ష ఆర్థిక వ్యవస్థ

226views

భారత అంతరిక్ష రంగ ఆర్థిక వ్యవస్థ 2040 నాటికి 40 బిలియన్ డాలర్లకు చేరుతుం దని కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ తెలిపారు. ఈ మొత్తం 100 బిలియన్ డాలర్ల వరకు వెళ్లే అవకాశమూ ఉందని కొన్ని విదేశీ సంస్థలు అంచనా వేసినట్లు పేర్కొ న్నారు. భవిష్యత్లో శాస్త్రవేత్తలకు మెరుగైన పని వాతావరణమూ ఏర్పడుతుందని తెలిపారు. “ప్రస్తుతం భారత అంతరిక్ష ఆర్థిక వ్యవస్థ అంత ఆశాజనకంగా లేదు. అది 8 బిలియన్ డాలర్లుగా మాత్రమే ఉంది. కానీ, వేగవంతమైన వృద్ధి నమోదు చేస్తున్నాం. ఐరోపా ఉపగ్రహాల ప్రయోగాల వల్ల 230- 240 మిలియన్ యూరోలు, అమెరికా శాటిలైట్ల ప్రయోగం నుంచి 170- 180 మిలియన్ డాలర్లు ఆర్జించాం” అని వివరించారు.

ఇస్రో తొలి రాకెట్ను ప్రయోగించి 60 వసంతాలు పూర్తయిన వేళ జితేంద్ర సింగ్ మాట్లాడారు. అమెరికా తరహాలో భారత్లోనూ ఏర్పాటు చేసిన ‘అనుసంధాన్ నేషనల్ రీసెర్చ్ ఫౌండే షన్’ వంటి సంస్థల వల్ల అంతరిక్ష రంగ అభివృద్ధికి బలమైన పునాదులు పడతాయని జితేంద్ర సింగ్ ఆకాం క్షించారు. ఇలాంటి చర్యల వల్ల మన అంతరిక్ష రంగం లోకి 70 శాతం వనరులు ప్రభుత్వేతర రంగాల నుంచే వస్తాయని తెలిపారు.

భారత అంతరిక్ష రంగం వనరుల కొరతను ఎదుర్కొన్నది నిజమేనని చెప్పారు. అయితే, విజ్ఞాన శాస్త్రంలో మనకున్న అపార అనుభవం ద్వారా దాన్ని అధిగమించామన్నారు. ఈ రంగంలో ఇతర దేశా లనూ అధిగమించే సత్తా మనకు ఉందని ధీమా వ్యక్తం చేశారు. చంద్రుడిపైకి ఇతర దేశాలు వ్యోమనౌకలు పంపినప్పటికీ.. అక్కడ నీటి జాడలను కనుగొన్నది మాత్రం మనమేనని గుర్తుచేశారు.

అంతరిక్ష రంగం లోకి ప్రైవేటు సంస్థలను ఆహ్వానించాలనే ప్రభుత్వ నిర్ణయాన్ని కీలక మైలురాయిగా జితేంద్ర సింగ్ అభి వర్ణించారు. దీని వల్ల ఇటు నిధులతో పాటు అటు విజ్ఞానం పరంగానూ అదనపు వనరులు చేతికందా యని పేర్కొన్నారు. ఫలితంగా దేశంలో అంతరిక్ష రంగానికి ఆదరణ లభించిందన్నారు. చంద్రయాన్ ప్రాజెక్టులో ప్రతి వ్యక్తి తమకు తాము భాగస్వాము లుగా భావించారని తెలిపారు.

భారత అంతరిక్ష రంగంలో గగన్యాన్ మరో కీలక మైలురాయిగా నిలిచిపోతుందని జితేంద్ర సింగ్ అన్నారు. దీనికింద 2025 నాటికి భారత్ ఓ వ్యోమగామిని రోదసీలోకి పంపి సురక్షితంగా తీసుకొస్తుందని మంత్రి ధీమా వ్యక్తం చేశారు. అంతకంటే మూడు నెలల ముందు ఓ రోబోను పంపుతామని తెలిపారు. అది పూర్తిగా వ్యోమగామిలాగే వ్యవహరిస్తుందని వెల్లడించారు.