
370views
కార్తిక పౌర్ణమిని పురస్కరించుకుని రాష్ట్రంలోని శివాలయాల్లో భక్తుల సందడి నెలకొంది. వేకువజాము నుంచే భారీ సంఖ్యలో భక్తులు ఆలయాల వద్దకు చేరుకుని గరళకంఠుడికి ప్రత్యేక అభిషేకాలు, పూజలు నిర్వహిస్తున్నారు. దీంతో ఆలయాలు శివనామస్మరణతో మార్మోగుతున్నాయి. పలుచోట్ల భక్తులు నదుల్లో పుణ్యస్నానాలు ఆచరించి కార్తిక దీపారాధన చేశారు. గోస్పాద క్షేత్రం, రాజమహేంద్రవరంలో గోదావరి, విజయవాడలో కృష్ణా నదుల్లో పుణ్యస్నానాలు చేశారు. శ్రీశైలం, శ్రీకాళహస్తి, ద్రాక్షారామం, అమరావతి తదితర ప్రాంతాల్లోని ఆలయాల్లో ప్రత్యేక పూజలు జరుగుతున్నాయి.







