News

రేపు ఇంద్రకీలాద్రిపై కోటి దీపోత్సవం

193views

కార్తిక పౌర్ణమిని పురస్కరించుకొని రేపు ఇంద్రకీలాద్రిపై కోటి దీపోత్సవాన్ని నిర్వహిస్తున్నట్లు దుర్గగుడి ఈవో రామారావు ఒక ప్రకటనలో తెలిపారు. సాయంత్రం 6.30 గంటలకు అమ్మవారి ప్రధాన ఆలయం, ఉపాలయాలు, ఘాట్‌ రోడ్డు కనకదుర్గానగర్‌ ప్రాంతాల్లో భక్తులు ప్రమిదల్లో ఆవు నెయ్యి వేసి ఒత్తులు వెలిగించేందుకు ఏర్పాట్లు చేసినట్లు పేర్కొన్నారు. భక్తుల తొక్కిసలాటకు తావు లేకుండా క్రమపద్ధతిలో వారికి కేటాయించిన ప్రాంతాల్లో దీపాలు వెలిగించి దేవస్థానం అధికారులకు సహకరించాలని కోరారు. కోటి దీపోత్సవంలో దుర్గమ్మ భక్తులు విరివిగా పాల్గొని అమ్మవారి కృపకు పాత్రులు కావాలని విజ్ఞప్తి చేశారు.

27న గిరి ప్రదక్షిణ:
ఈనెల 27న ఉదయం 5.55గంటలకు ఆదిదంపతుల గిరిప్రదక్షిణ ఊరేగింపును దేవస్థానం నిర్వహిస్తోందని ఈవో తెలిపారు. గంగా పార్వతీ సమేత దుర్గామల్లేశ్వర స్వామి వార్ల ఉత్సవమూర్తులను అలంకరించిన వాహనంపై ఉంచి దుర్గగుడి టోల్‌గేటు నుంచి కుమ్మరిపాలెం సెంటరు, రామమందిరం, నాలుగుస్తంభాల సెంటరు, చెరువు సెంటరు, సితార, కబేళా, పాలఫ్యాక్టరీ, చిట్టినగర్‌ కొత్తపేట, బ్రాహ్మణ వీధి మీదుగా తిరిగి ఇంద్రకీలాద్రిపైకి చేరుతుందని పేర్కొన్నారు. భక్తులు సంప్రదాయ దుస్తులో ఊరేగింపులో పాల్గొనాలని కోరారు.