News

భారత్ లేకుండా ప్రపంచంలో సామరస్యం సాధ్యం కాకపోవచ్చు : డా. మోహన్ భగవత్ జీ

310views

థాయ్‌లాండ్‌లోని బ్యాంకాక్‌లో జరుగుతున్న ప్రపంచ హిందూ కాంగ్రెస్ సమావేశంలో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ పరమ పూజ్యనీయ సర్ సంఘ్ చాలక్ డా. మోహన్ భగవత్ జీ పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ, తాత్వికత భిన్నంగా ఉండవచ్చు. కానీ ఆయా సనాతన సంప్రదాయాల మూలం ఒకటే..గమ్యం ఒకటే. ప్రస్తుతం ఇది మన విధి. అని డా. మోహన్ భగవత్ జీ అన్నారు. వసుదైవక కుటుంబకం కోసం హిందువులు ఇప్పటికే తమ పాత్రను పోషించడం ప్రారంభించారని, హిందువులందర్ని కలుపుకొని ఆ సర్వేస్వరుడు మన ముందుంచిన ప్రపంచం ఒకే కుటుంబ కార్యంలో భాగంగా విశ్వాన్ని ఆర్యమయం చేద్దామని తెలిపారు.