News

అయోధ్యలో ప్రాణ ప్రతిష్ఠానంతరం 48 రోజుల పాటు అనుస్ఠాన కార్యక్రమాలు

279views

అయోధ్య రాంలల్లా ప్రాణ ప్రతిష్ఠానంతరం 48 రోజుల పాటు ఆస్థానంలో అనుస్ఠాన కార్యక్రమాలు నిర్వహించనున్నారని శ్రీరామ తీర్ధ క్షేత్రం ట్రస్ట్ తెలిపింది.ఇందులో భాగంగా రోజూ 1 కిలో వెండి కలశంతో రాంలల్లాకు అభిషేకం నిర్వహించనన్నట్లు పేర్కొంది. శ్రీ రామ్ సేవ పేరుతో ఒక యాప్ సిద్ధం అవుతోందని.. అనుస్ఠాన కార్యక్రమాల్లో పాలు పంచుకునేందుకు ఈ యాప్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చని వెల్లడించింది.నిర్ణీత నియమ నిబంధనలు అనుసరించి అర్హులైనవారికి రాంలల్లాను సేవించే అవకాశం కల్పించనున్నట్లు శ్రీరామ తీర్ధ క్షేత్రం ట్రస్ట్ తెలిపింది.