
242views
విజయవాడలోని చిట్టినగర్ లో అయోధ్య రాముడి అక్షింతల కలశ ఊరేగింపు సాగింది. కేఎల్ రావు నగర్ లోని అమ్మవారి ఆలయం నుంచి గురువారం ఉదయం పాలప్రాజెక్టు సమీపంలోని హనుమత్ దీక్షా పీఠం వరకు అక్షింతల ఊరేగింపు జరిగింది. మేళతాళాలు, మంగళవాయిద్యాల నడుమ శ్రీరామ నామస్మరణతో భక్తులు ఊరేగింపులో పాల్గొన్నారు. బీజేపీ జిల్లా కోశాధికారి అవ్వారు బుల్లాబ్బాయ్ మాట్లాడుతూ అక్షింతల కలశాన్ని హనుమాన్ ఆలయంలో ఉంచి నిత్యం పూజలు చేస్తారన్నారు. జనవరి ఒకటో తేదీ నుంచి శ్రీరామ చంద్రుని చిత్రపటం, అక్షింతలను ఇంటింటికీ పంపిణీ చేస్తామని పేర్కొన్నారు





