News

నేడు రూ.300 దర్శన టికెట్ల కోటా విడుదల

210views

వచ్చే ఏడాది ఫిబ్రవరి నెలకు రూ.300 ప్రత్యేక ప్రవేశదర్శన టికెట్ల కోటాను టిటిడి ఈ రోజు ఉదయం 10 గంటలకు ఆన్‌లైన్‌లో విడుదల చేయనుంది. తిరుమల, తిరుపతిలోని గదుల కోటా మధ్యాహ్నం 3 గంటలకు అందుబాటులోకి రానుంది. భక్తులు ttdevasthanams.ap.gov.in వెబ్‌సైట్‌లో దర్శన టికెట్లు, గదులను ముందస్తుగా బుక్‌ చేసుకోవచ్చు.

27న శ్రీవారి సేవాకోటా విడుదల
2024 ఫిబ్రవరి 16న రథసప్తమి పర్వదినానికి సంబంధించిన శ్రీవారి సేవా టికెట్లను ఈ నెల 27న ఉదయం 10 గంటలకు తితిదే ఆన్‌లైన్‌లో విడుదల చేయనుంది. 18-50 ఏళ్ల వయోపరిమితి కలిగినవారు అర్హులు. తిరుమల, తిరుపతిలో భక్తుల స్వచ్ఛంద సేవలకుగాను జనవరి, ఫిబ్రవరి నెలలకు సంబంధించిన శ్రీవారిసేవ, నవనీత సేవ కోటాను ఈనెల 27న మధ్యాహ్నం 12 గంటలకు విడుదల చేస్తారు. అదేరోజు మధ్యాహ్నం 3 గంటలకు పరకామణి సేవ కోటాను తితిదే విడుదల చేయనుంది. ఈ సేవలను www.tirumala.org/వెబ్‌సైట్‌లో భక్తులు బుక్‌ చేసుకోవచ్చు.