News

అమెరికాలో ఘనంగా దీపావళి వేడుకలు… సెలవు ప్రకటించిన జోబైడెన్ సర్కారు

305views

అగ్రరాజ్యం అమెరికాలో దీపావళి వేడుకలు కొత్త పుంతలు తొక్కుతున్నాయి. ఫెస్టివల్ ఆఫ్ లైట్స్ కోసం అమెరికాలోని భారతీయులు భారీ వేడుకలను ప్లాన్ చేశారు.

అమెరికా ప్రభుత్వం దీపావళిని పండుగగా గుర్తించి పాఠశాలలకు సెలవు ప్రకటించింది. ఈ నేపథ్యంలో న్యూజెర్సీలోని ఎడిసన్‌లో దీపావళి ఫెస్టివల్ సెలబ్రేషన్స్ గ్రాండ్ గా జరుగనున్నాయి. వైట్ హౌస్ దీపావళి దీపావళి వేడుకలకు అందంగా ముస్తాబైంది. చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా నిర్వహించే ఈ వేడుకల్లో చిన్నా, పెద్ద అంతా కలిసి ఉత్సాహంగా పాల్గొని సందడి చేసేందుకు రడీ అయ్యారు.

అమెరికా శ్వేతసౌధం దీపావళి పండగ శోభ సంతరించుకుంది. అంగరంగ వైభవంగా అమెరికాలో దీపాల పండుగను జరుపుకొనేందుకు ఇండో అమురికన్లు సిద్దమయ్యారు. ఇక ఈసారి దీపావళి పండగ నవంబర్ 10 వ తేదీ నుంచి నవంబర్ 15 వ తేదీవరకు అమెరికాలో ఘనంగా జరుగనున్నాయి.

ప్రపంచవ్యాప్తంగా దీపావళి పండగ శోభ సంతరించుకుంది. ఫెస్టివల్ ఆఫ్ లైట్స్ పేరుతో జరుపుకునే ఈ దీపావళి పండగ కోసం ఇళ్లు, ఆలయాలు ఎంతో అందంగా ముస్తాబు చేశారు. అయితే ఈ దీపాల పండుగను అమెరికాలో కూడా ఎంతో ఘనంగా నిర్వహించుకుంటున్నారు. అక్కడ జరిగే అతి పెద్ద పండుగలైన హాలోవిన్, థ్యాంక్స్ గివింగ్, క్రిస్మస్ లాంటి పండుగల తర్వాత ఆ స్థాయిలో ఈ దీపావళి పండుగను అమెరికాలో నిర్వహించేందుకు అక్కడున్న భారతీయులు సిద్దమయ్యారు. ఈ పండగల రోజు అమెరికాలో సెలవు కూడా ప్రకటిస్తూ ఉంటారు. దీపావళి పండుగ సందర్భంగా కూడా అమెరికాలో సెలవు ప్రకటించారు. ఇక ఈసారి దీపావళి పండగ నవంబర్ 10 వ తేదీ నుంచి నవంబర్ 15 వ తేదీ వరకు ప్రపంచ వ్యాప్తంగా జరగనుంది.