News

హిందూ మతంలోకి వచ్చిన ముస్లిం కుటుంబం

822views

మహారాష్ట్రలోని ఛత్రపతి శంభాజీనగర్‌లో మధ్యప్రదేశ్‌కు చెందిన బాగేశ్వర్ ధామ్ పీఠాధిపతి ధీరేంద్ర కృష్ణ శాస్త్రి సమక్షంలో అహ్మద్‌నగర్ జిల్లాకు చెందిన “ఒక ముస్లిం కుటుంబం తమ సొంత మతంలోకి తిరిగి వచ్చింది. స్థానిక అయోధ్య నగరి మైదానంలో ధీరేంద్ర కృష్ణ నేతృత్వంలో మూడు రోజుల పాటు ‘రామ్ కథ’ అనే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇందులో భాగంగా ముస్లిం మతాన్ని అనుసరించే 10 మంది సనాతన ధర్మాన్ని స్వీకరించారు. వీరికి శుద్ధి నిర్వహించి స్వధర్మంలోకి ఆహ్వానించినట్లు కృష్ణశాస్త్రి తెలిపారు.

‘ఎవరైనా ఒత్తిడి చేశారా?’
హిందూ మతాన్ని స్వీకరించిన కుటుంబాన్ని “ఎవరైనా మీపై ఒత్తిడి తెచ్చారా?” అని పీఠాధిపతి ప్రశ్నించగా.. కుటుంబ పెద్ద జమీల్ నిజాం షేక్ మాట్లాడుతూ, ‘‘చిన్నప్పటి నుండి బజరంగ్ దళ్ ద్వారా తాను ‘సనాతన ధర్మాన్ని’ అనుసరిస్తున్నానని.. నాపై ఎవ్వరూ ఎలాంటి ఒత్తిడి తీసుకురాలేదు,’’ అని షేక్ స్పష్టం చేశారు. తన కుటుంబం చాలా కాలంగా రాముడు, కృష్ణుడిని పూజిస్తోందని గణేష్ ఉత్సవాన్ని కూడా ప్రతి ఏటా నిర్వహిస్తోందని ఆయన తెలిపారు.

భజరంగ్ దళ్ అధ్యక్షుడు కునాల్ భండారీ మాట్లాడుతూ కుటుంబమంతా తమ ఇష్టానుసారమే హిందూ మతాన్ని స్వీకరించారని.. ఒత్తిడి చేసి మతం మార్చటం సనాతన ధర్మంలో లేదని పేర్కొన్నారు.

Source : abplive