
పాకిస్తాన్‌లోని సింధ్‌లో నివసిస్తున్న కచ్చి సమాజానికి చెందిన హిందూ గ్రామం పై ముస్లిం భూస్వామి చేసిన ద్వేషపూరిత చర్యల ఫలితంగా ఆ గ్రామం నాశనమైంది. సౌత్ ఏషియన్ డైజెస్ట్ నివేదిక ప్రకారం.. ముస్లిం భూస్వామి చర్యలు వివక్షకు మించినవని.. ఇళ్లు మరియు ఆలయాన్ని కూల్చివేయడంతోపాటు నాలుగు దశాబ్దాలకు పైగా కుటుంబాలు నివసించిన మొత్తం హిందూ గ్రామానికి ఉద్దేశపూర్వకంగా నిప్పు పెట్టారని తెలిపింది.
భూస్వామి కక్షాపూరిత చర్యలు కూల్చివేతలతో ఆగలేదు అతని అనుచరులు గ్రామస్తుల మోటర్‌బైక్‌లను లాక్కోవడానికి యత్నించారని, ఇప్పటికే పేదరికంలో ఉన్న కచ్చి సమాజం ఎదుర్కొంటున్న కష్టాలు ఈ చర్యల వల్ల మరింత అధికమయ్యాయని నివేదికలు సూచిస్తున్నాయి.
గ్రామ విధ్వంసం తర్వాత పరిణామాలను తెలిపే ఒక వీడియో, ఆ గ్రామవాసులు ఎదుర్కొన్న విధ్వంసానికి సాక్ష్యంగా నిలుస్తోంది. ఇది పాకిస్తాన్‌లో మతపరమైన మైనారిటీలు ఎదుర్కొంటున్న
వివక్ష వారిపై పెరుగుతున్న హింసను తెల్పుతోంది. మైనారిటీ హిందూ వర్గాలకు రక్షణ, న్యాయం వంటి తక్షణ అవసరాన్ని వివరిస్తోంది.
Muslim landlord demolishes houses, Hindu temple, and sets fire to entire Hindu village in Sindh, Pakistan. The Hindu Kachhi community, who had lived there for 40 years, has been left homeless and threatened. https://t.co/nxoja5xqRG pic.twitter.com/OMTc1hQtHK
— South Asian Digest (@SADigestOnline) October 31, 2023
Source : Hindu Post



