News

స్వాతంత్ర్యం తరువాత తొలిసారిగా కశ్మీర్ శారదా మాత దేవాలయంలో పూజలు!

292views

జమ్ముకశ్మీర్‌లో సోమవారం ఓ అద్భుత ఘట్టం ఆవిష్కృతమైంది. కుప్వారా జిల్లా టీట్వాల్ గ్రామంలోని చారిత్రక శారదా మాత దేవాలయంలో 1947 తరువాత తొలిసారిగా నవరాత్రి పూజ నిర్వహించారు. సరిహద్దుకు సమీపాన ఉన్న ఈ దేవాలయంలో పూజలకు భక్తులు పెద్ద ఎత్తున హాజరయ్యారు.

ఈ సందర్భంగా కేంద్ర హోం మంత్రి అమిత్ షా హర్షం వ్యక్తం చేశారు. ఈ దేవాలయ పునరుద్ధరణ తర్వాత మార్చి 23న ఆయన దేవాలయాన్ని ప్రారంభించారు. కశ్మీర్‌ లోయలో శాంతియుత వాతావరణ స్థాపనకు ఇది నిదర్శనమని అప్పట్లో షా పేర్కొన్నారు.కశ్మీర్‌లో ఆధ్యాత్మిక సంస్కృతి పునరుద్ధరణ జరిగిందన్నారు. స్వాతంత్ర్యానికి పూర్వం ఉన్న స్థలంలోనే, అప్పటి డిజైన్ ఆధారంగానే నూతన దేవాలయాన్ని ఏర్పాటు చేశారు. నాటి కార్యక్రమంలో పాల్గొనేందుకు దేశం నలుమూలల నుంచి పెద్ద ఎత్తున భక్తులు హాజరయ్యారు.