
326views
హిందూ వివాహాలపై అలహాబాద్ హైకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. హిందూ వివాహంపై ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది.
ఏడడుగులు, ఇతర సంప్రదాయ తంతు నిర్వహించకుండా జరిగే హిందూ వివాహం చెల్లుబాటు కాబోదని అలహాబాద్ హైకోర్టు స్పష్టం చేసింది. తనకు విడాకులు ఇవ్వకుండా వదిలేసిన తన భార్య మరో వివాహం చేసుకున్నారని ఒక వ్యక్తి దాఖలు చేసిన పిటిషన్ ను కొట్టి వేసింది.
హిందూ చట్టంలో వధువు, వరుడు కలిసి నడిచే ఏడడుగులు అన్నది అత్యంత ముఖ్యమైన తంతు. అయితే ఫిర్యాదుదారు ఆరోపించినట్లుగా అలాంటిది జరిగినట్లు కనిపించడం లేదని కేసును విచారించిన జస్టిస్ సంజయ్ కుమార్ వ్యాఖ్యనించారు.





