News

కెనడాలో హిందూ స్టూడెంట్స్ కౌన్సిల్ ఆధ్వర్యంలో రథయాత్ర

319views

కెనడాలోని టొరంటో, అంటారియోలో అంటారియో కాలేజ్ ఆఫ్ ఆర్ట్ & డిజైన్ యూనివర్శిటీ -OCAD, టొరంటో విశ్వవిద్యాలయంలోని హిందూ స్టూడెంట్స్ కౌన్సిల్-HSC సంస్థల ఆధ్వర్యంలో హిందూఫోబియాకు వ్యతిరేకంగా నిర్వహించిన రథయాత్ర ఉత్సవానికి 300 మంది విద్యార్థులు హాజరయ్యారు.

క్యాంపస్ నుండి OCAD యూనివర్శిటీ వరకు జరిగిన రధయాత్రలో జగన్నాధుడు, బలరాముడు, సుభద్రలను స్మరించుకుంటూ, భగవన్నామస్మరణతో ఊరేగింపు జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా ఐదు గంటల పాటు 300 మంది విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు.

మహామంత్ర పఠనం మరియు శ్రీజగన్నాథుని ఊరేగింపులో, హిందువులు కాని వారు సైతం నివాళులర్పించడం చూసి పులకించానని HSC UofT సెయింట్ జార్జ్ చాప్టర్ ప్రెసిడెంట్ ఆదిత్య కార్తీక్ తెలిపారు.

హిందూ స్టూడెంట్స్ కౌన్సిల్, కోలిషన్ ఆఫ్ హిందుస్ ఆఫ్ నార్త్ అమెరికా -CoHNA, కెనడియన్ ఆర్గనైజేషన్ ఫర్ హిందూ హెరిటేజ్ ఎడ్యుకేషన్ -CoHHE, ఇస్కాన్, భక్తి యోగా క్లబ్, టొరంటో జైన్ మందిర్, శ్రీ స్వామినారాయణ్‌తో సహా వివిధ విద్యార్ధి, ధార్మిక సంస్థలు పాల్గొన్నాయి. హిందూ వ్యతిరేక వాతావరణం ఉన్నప్పటికీ, OCAD మరియు UofTకి చెందిన హిందూ విద్యార్థులు మొత్తం కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో ప్రధాన పాత్ర పోషించారు. యూనివర్శిటీ అడ్మినిస్ట్రేటర్ల మద్దతుతో, అదనపు భద్రతా చర్యల తీసుకోవడంతో ఈ రధయాత్రలో 300 మందికి పైగా హాజరయ్యి విజయవంతచేశారు.హిందూఫోబియాకు వ్యతిరేకంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు నిర్వాహకులు తెలిపారు.