
కర్ణాటకలోని శివమొగ్గలో ఈద్ ఊరేగింపులో భాగంగా మిలాద్ ఉన్-నబీ ఊరేగింపులో పాల్గొన్న వ్యక్తులు హిందువుల ఇళ్లతో పాటు మహిళలపై రాళ్లదాడికి పాల్పడడంతో అనేక మంది గాయపడ్డారు.మత విద్వేషాలను రెచ్చగొట్టేలా హిందువులను చంపుతున్న టిప్పు సుల్తాన్ కటౌట్, ఔరంగజేబ్ పోస్టర్లు ప్రదర్శించారు.
ఈద్ సందర్భంగా.. టిప్పు సుల్తాన్ కాషాయ దుస్తులు ధరించిన హిందువులను చంపుతున్నట్లు చిత్రీకరించిన కటౌట్‌ను ప్రదర్శించడం. హిందువులను రెచ్చగొట్టేందుకు ఉద్దేశపూర్వకంగానే ఈ కటౌట్‌ను ఏర్పాటు చేసినట్లు స్పష్టమైంది. హిందూ సంస్థల అనుబంధ కార్యకర్తలు కటౌట్ ను తొలగించాలని, రాళ్లదాడి ఘటనకు వ్యతిరేకంగా ఆందోళనకు దిగడంతో పోలీసులు రంగప్రవేశం చేశారు.
శాంతిభద్రతలను పునరుద్ధరించేందుకు పోలీసులు జోక్యం చేసుకుని ఈద్ ఊరేగింపును అడ్డుకున్నారు. పోలీసుల చర్యను వ్యతిరేకిస్తూ.. ఊరేగింపులో పాల్గొన్నవారు పోలీసులపై రాళ్లు రువ్వారు,
పరిస్థితిని అదుపులోకి తీసుకురావడానికి, శివమొగ్గ పోలీసు సూపరింటెండెంట్, జి.కె.మిథున్ కుమార్, ఇరు వర్గాల స్థానిక నాయకులతో చర్చించి, శాంతిని పునరుద్ధరించడంలో సహకరించాలని కోరారు. అలాగే ఆ ప్రాంతంలో ఉద్రిక్తతలు మరింత పెరగకుండా నిరోధించడానికి వివాదస్పద చిత్రపటాన్ని కర్టెన్‌తో కప్పాలని నిర్వాహకులకు సూచించారు.





