
ఆర్ట్ ఆఫ్ లివింగ్ వ్యవస్థాపకుడు శ్రీశ్రీ రవిశంకర్ చొరవ తీసుకోకుంటే ఇవాళ తమ దేశం అశాంతితో అట్టుడుకుతుండేదని కొలంబియా పార్లమెంట్ సభ్యుడు జువన్ కార్లోస్ అన్నారు. అమెరికాలోని వాషింగ్టన్ డీసీలో నేషనల్ మాల్ వేదికగా ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రపంచ సాంస్కృతిక ఉత్సవాల్లో ఆయన పాల్గొని ప్రసంగించారు. తమ దేశంలో శాంతి నెలకొనేందుకు రవిశంకర్ కృషి చేశారని, అందుకు తమ దేశం ఆయనకు ఎప్పటికీ రుణపడి ఉంటుందని చెప్పారు.
గురుదేవ్ బొగోటా (కొలంబియా రాజధాని) వచ్చి మా అధ్యక్షుడు, తిరుగుబాటుదారులైన FARC (రివల్యూషనరీ ఆర్మ్‌డ్ ఫోర్సెస్ ఆఫ్ కొలంబియా) మధ్య సయోధ్య కుదిర్చారు. తిరుగుబాటుదారులకు నచ్చజెప్పి ప్రభుత్వంతో శాంతి ఒప్పందం కుదిరేలా చేశారు. ఒకవేళ ఆయనే లేకుంటే కొలంబియాలో ఇవాళ శాంతి అనేది ఉండేది కాదు. మేం మిమ్మల్ని మా దేశ పౌరులుగా భావిస్తున్నాం. కొలంబియానూ మరో నివాసంలా భావించండి.’’ అని కార్లోస్ అన్నారు.





