News

సోమనాథ్‌ ఆలయంలో ఇస్రో ఛైర్మన్‌ పూజలు

244views

గుజరాత్‌లోని సోమనాథ్‌ ఆలయాన్ని భారత అంతరిక్ష ఫరిశోధనా సంస్థ (ISRO) ఛైర్మన్‌ ఎస్‌ సోమనాథ్‌ దర్శించుకున్నారు. భవిష్యత్తులో ఇస్రో చేపట్టే ప్రయోగాలు విజయవంతమయ్యేలా ఆశీర్వదించాలని సోమనాథునికి ప్రత్యేక పూజలను నిర్వహించారు.

సోమేశ్వర్‌ మహాపూజ నిర్వహించిన ఆయన.. యజ్ఞంలోనూ పాల్గొన్నారని ఆలయ అధికారులు వెల్లడించారు. సోమనాథుడి ఆశీస్సులు లేకపోతే ఈ విజయం సాధ్యమయ్యేది కాదని అభిప్రాయపడ్డారు. ఇస్రో చీఫ్‌ సోమేశ్వర్‌ మహాపూజ అనంతరం ఆలయ ప్రాంగణంలోని వినాయక ఆలయంలో యజ్ఞంలో పాల్గొన్నారని శ్రీసోమనాథ్‌ ట్రస్టు జీఎం తెలిపారు. శ్రీకృష్ణ భగవానుడు తుదిశ్వాస విడిచినట్లు భక్తులు విశ్వసించే ప్రాంతం భాల్కతీర్థను సైతం ఆయన సందర్శించారని తెలిపారు.