
281views
ఉపాధ్యాయ వృత్తిలో ఉండి బాలికలతో మత ప్రవచనాలు చదివించి, బోధిస్తున్న పనసపుట్టు ప్రభుత్వ గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు రామారావుకు అధికారులు షోకాజ్ నోటీసు జారీ చేశారు. ఈ ఘటనపై విద్యార్థుల తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చదువు చెప్పాల్సిన ఉపాధ్యాయుడు మత ప్రచారం చేయడం పట్ల విద్యార్థులు తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.రామారావుపై వచ్చిన ఆరోపణలపై ఏటీడబ్ల్యూఓ విచారణ చేపట్టగా.. ఆధారాలు లభించడంతో షోకాజ్ ఇచ్చి తదుపరి చర్యలు చేపట్టనున్నామని వివరించారు.





