
394views
గోవులను కబేళాకు అమ్ముకుంటున్నారని.. ఇస్కాన్ పై ఎంపీ మేనకా గాంధీ చేసిన ఆరోపణలను ఇస్కాన్ ఖండించింది. గో సంరక్షణలో ఇస్కాన్ ఎల్లప్పుడూ ముందుంటుందని స్పష్టం చేసింది. గోశాలకు వచ్చిన గోవులను కడవరకూ జాగ్రత్తగా సంరక్షిస్తామని సంస్థ ప్రతినిధి యుధిష్టర్ గోవిందా దాస్ ట్వీట్ చేశారు.
ఇటీవలి కాలంలో ఆవులను పూజించడం గో సంరక్షణ సంస్కృతిని పునరుద్ధరించడంలో సహాయపడేందుకు ఇస్కాన్ రైతులకు, కుటుంబాలకు ఆవు సంరక్షణ పద్ధతులపై శిక్షణా కార్యక్రమాలను ప్రారంభించిందని తెలిపారు. దేశంలో ఇస్కాన్ నిర్వహించే పలు గోశాలలు ప్రభుత్వం గోసంరక్షణలో అతున్నత ప్రమాణాలతో నడుస్తునట్లు గుర్తించబడ్డాయని ప్రకటనలో పేర్కొన్నారు.





