News

మోహినీ అవతారంలో దర్శనమిచ్చిన శ్రీమలయప్పస్వామి

254views

శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు కన్నులపండువగా సాగుతున్నాయి. ఐదో రోజు శుక్రవారం ఉదయం మోహినీ అవతారంలో శ్రీమలయప్పస్వామి భక్తులకు అభయప్రదానం చేశారు. తిరుమాడ వీధుల్లో బంగారు తిరుచ్చిపై ఊరేగుతూ భక్తులకు వరాలు ప్రసాదించారు. మంగళవాయిద్యాల నడుమ స్వామివారి వాహనసేవ కోలాహలంగా జరిగింది.