
తిరుమల (Tirumala)లో ఉగ్రవాదుల కలకలం అసత్యమని తిరుపతి ఎస్పీ పరమేశ్వర రెడ్డి (SP) వెల్లడించారు. పోలీసు, టీటీడీ విజిలెన్స్ యంత్రాంగం అప్రమత్తంగా ఉందన్నారు. అది ఫేక్ మెయిల్‌గా పేర్కొన్నారు. తిరుమలలో ఎలాంటి ఉగ్రవాదుల సంచారం లేదని, భక్తులు ఇలాంటి అసత్య ప్రచారాలు నమ్మవద్దని ఆయన సూచించారు.
ఇదిలావుండగా… నిన్న రాత్రి సమయంలో తిరుమల (Tirumala)లో భద్రతాధికారులు హైఅలర్ట్ ప్రకటించారు. ఉగ్రవాదులు చొరబడ్డారంటూ.. పోలీసులకి గుర్తుతెలియని వ్యక్తి మెయిల్ పంపాడు. దాంతో తిరుపతి అర్బన్ పోలీసులు అప్రమత్తమైయ్యారు. టీటీడీ భద్రతాధికారులని పోలీసు అధికారులు అప్రమత్తం చేశారు. ఇటీవల సులభ్ కార్మికుల సమ్మె నేపథ్యంలో కార్మికుల రూపంలో తిరుమలకు వచ్చి ఉంటారని పోలీసుల అనుమానం వ్యక్తం చేస్తున్నారు. తిరుమలలో సీసీ ఫుటేజీని భద్రతాధికారులు పరిశీలిస్తున్నారు. ఉగ్రవాదుల చొరబాటుని అధికారికంగా పోలీసు శాఖ ధృవీకరించలేదు. ఈ నేపథ్యంలో తిరుమలలో టీటీడీ విజిలెన్స్ పోలీసులు విస్తృత తనిఖీలు చేపట్టారు.




