News

దుర్గమ్మకు రూ. 20 లక్షల విలువైన వజ్రాల హారం

259views

ఏపీలోని విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువుదీరిన కనకదుర్గమ్మకు రూ.20 లక్షల విలువైన హారం కానుకగా దాతలు ఇచ్చారు. హైదరాబాద్‌ నగరానికి చెందిన సీఎం రాజేష్‌, ప్రకృతి దంపతులు రూ.20 లక్షల విలువచేసే వజ్రాలు పొదిగిన 180 గ్రాముల బంగారు హారాన్ని అమ్మవారి అలంకరణ నిమిత్తం మంగళవారం నాడు.. ఆలయ ఈవో భ్రమరాంబకు అందజేశారు. ఈ సందర్బంగా దాతలకు అమ్మవారి దర్శనం అనంతరం రుత్వికులు వారికి శేషవస్త్రం, ప్రసాదం, ఆశీర్వచనం అందజేశారు.