News

రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల విడుదల

242views

మే, జూన్‌ నెలలకు సంబంధించిన రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటాను టీటీడీ మంగళవారం విడుదల చేసింది. టీటీడీ అధికారిక వెబ్‌సైట్‌ ‘తిరుపతిబాలాజీ.ఏపీ.జీవోవీ.ఇన్‌’లో ఉదయం 10 గంటలకు ఈ రెండు నెలల కోటాను విడుదల చేశారు. టీటీడీ అధికారిక వెబ్‌సైట్‌లోనే దర్శన టికెట్లు బుక్‌ చేసుకోవాలని, నకిలీ వెబ్‌సైట్లను నమ్మి మోసపోవద్దని భక్తులను టీటీడీ కోరింది. టీటీడీ మొబైల్‌ యాప్‌ ‘టీటీదేవస్థానమ్స్‌’ ద్వారా కూడా దర్శన టికెట్లు బుక్‌ చేసుకోవచ్చని తెలిపింది.