News

తిరుమల శ్రీవారి ఆలయం పరిసరాల్లో హెలికాఫ్టర్‌ చక్కర్లు

251views

తిరుమల: తిరుమల శ్రీవారి ఆలయం పరిసరాల్లో మంగళవారం సాయంత్రం 3 హెలికాప్టర్లు చక్కర్లు కొట్టడం భక్తులను ఆందోళనకు గురి చేసింది. శ్రీవారి ఆలయానికి సమీపంలోని తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద భవనం, పరాకమణి భవనం, బాలాజీనగర్‌ ప్రాంతంలో హెలికాప్టర్‌లు సంచరించినట్టు అధికారులు గుర్తించారు. తిరుమలలో 3 హెలికాప్టర్లు చక్కర్లు కొట్టడంపై తితిదే విజిలెన్స్‌ విభాగం అధికారులు ఆరా తీస్తున్నారు. ఎయిర్‌ఫోర్స్‌కు చెందిన హెలికాప్టర్లు కడప నుంచి చెన్నై వెళ్తుండగా తిరుమల ఉపరితలంలో చక్కర్లు కొట్టినట్టు ప్రాథమికంగా గుర్తించారు. దీనికి సబంధించి పూర్తి వివరాలను అధికారులు సేకరిస్తున్నారు.