
కాణిపాక వరసిద్ధి వినాయకస్వామి ఆలయం వద్ద గురువారం నిర్వహించిన వివిధ టెండర్లు, లైసెన్సుల ద్వారా రూ.42.14 లక్షల ఆదాయం వచ్చినట్లు ఈవో వెంకటేశు తెలిపారు. ఆలయ ఆస్థాన మండపంలో గురువారం వివిధ టెండర్లు నిర్వహించారు. ఆలయ గోశాలలోని గోమయం తీసుకునే హక్కు కోసం రూ.2,20,000, కల్యాణకట్ట ఎదురుగా బంకు నిర్వహణకు రూ.4,25,000, ఆలయ పరిసరాల్లో భక్తుల ఫొటో తీసుకునే లైసెన్సు ద్వారా రూ.10,06,000, ఉచిత డార్మిటరీ హాలులో బంకు, హోటల్ నిర్వహణకు రూ.82,000, ఆలయం వద్ద సంప్రదాయ వస్త్రాలు, బొమ్మలు విక్రయించే దుకాణం రూ.11,16,000, మూలవిరాట్‌కు నిర్వహించే పాలాభిషేకానికి పాలు విక్రయించే లైసెన్సు కోసం రూ.5,55,000, బస్టాండు సముదాయములో దుకాణం నిర్వహణ కోసం రూ.8,10,000, ఈ మొత్తం కలిపి ఆలయానికి టెండర్లు, లైసెన్సు ద్వారా రూ.42,14,000 ఆదాయం లభించింది. ఈ మొత్తం లైసెన్సు హక్కులు కైవసం చేసుకున్నవారికి సంవత్సర కాలం పరిమితి ఉంటుంది.




