News

శోభకృత్ నామ సంవత్సర టీటీడీ పంచాంగం విడుదల… నేటి నుంచి విక్రయాలు

279views

టీటీడీ ముద్రించిన శ్రీ శోభకృత్ నామ సంవత్సర పంచాంగాన్ని ఈవో ధర్మారెడ్డి మంగళవారం తన కార్యాలయంలో విడుదల చేశారు. ప్రతి ఏటా లాగానే రాబోయే నూతన తెలుగు సంవత్సరాది శోభకృత్ నామ సంవత్సర పంచాగం ముద్రించినట్లు చెప్పారు. బుధవారం నుంచి తిరుమలలో రూ.75 చెల్లించి భక్తులు వీటిని కొనుగోలు చేయవచ్చని అన్నారు. మిగిలిన ప్రాంతాల్లో మార్చి రెండో వారం నుంచి అందుబాటులో ఉంచుతామని అన్నారు.