News

రుక్మిణి కృష్ణుడిగా తెప్పపై శ్రీనివాసుడి దర్శనం

221views

తిరుమల సాలకట్ల తెప్పోత్సవాల నేపథ్యంలో శ్రీనివాసుడు… రుక్మిణీకృష్ణుడిగా తెప్పపై భక్తులకు దర్శనమిచ్చారు. రుక్మిణి సమేత శ్రీకృష్ణుల ఉత్సవమూర్తుల ఊరేగింపు జరిగింది. ఆలయ నాలుగు మాడ వీధుల గుండా పుష్కరిణిలో తెప్పపై మూడు చుట్లు తిరిగి కనువిందు చేశారు. ఇదే సమయంలో తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. వారాంతపు సెలవు దినం కావడంతో ఆదివారం శ్రీ వేంకటేశ్వర స్వామిని దర్శించుకునేందుకు వివిధ ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో చేరుకుంటున్నారు