
226views
ప్రముఖ ప్రవచన కర్త చాగంటి కోటేశ్వరరావు కీలక నిర్ణయం తీసుకున్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) ధర్మ ప్రచార పరిషత్ సలహాదారు పదవిని ఆయన తిరస్కరించారు. టీటీడీకి సలహాలు ఇవ్వడానికి తనకు పదవులు అవసరం లేదని ఆయన అన్నారు.
టీటీడీకి తన సలహాలు అవసరమైతే పదవి లేకపోయినా తప్పకుండా ఇస్తానని చాగంటి స్పష్టం చేశారు. ఈ విషయంలో ఎప్పుడూ ముందు ఉంటానని అన్నారు. కాగా, టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి అధ్యక్షతన జనవరి 20న జరిగిన ధార్మిక పరిషత్ సమావేశంలో టీటీడీ ధార్మిక సలహాదారుగా చాగంటిని నియమిస్తూ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. తాజాగా, చాగంటి ఆ పదవిని తిరస్కరించారు.





